పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వడంతోనే మేయర్ పదవి దక్కింది..పిలా శ్రీనివాస్

కలకాలం పేరు నిలిచేలా పనిచేస్తా 

నా దృష్టిలో అందరూ కార్పొరేటర్లు సమానమే 

పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వడంతోనే మేయర్ పదవి దక్కింది..


 జర్నలిస్టులతో విశాఖ మేయర్ పిలా శ్రీనివాస్ 
.నా దృష్టిలో అందరు కార్పొరేటర్లు సమానమైన అని విశాఖ మేయర్ పీలా శ్రీనివాస్ అన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు ఇవ్వడంతోనే తనకు మేయర్ పదవి దక్కిందని ఆయన పేర్కొన్నారు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ సభ్యులు రావులవలస రామచంద్ర రావు ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆయనను అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరస్థాయిగా మంచి పేరు నిలిచేలా పనిచేస్తానని తాను ప్రజల మేయర్ గా నిలవాలన్నది ఆకాంక్షగా పేర్కొన్నారు ఏ పార్టీలో ఉన్నప్పటికీ సభ్యులందరూ సమానమని త్వరలోనే అన్ని వార్డుల సమస్యలు తెలుసుకుని ఆ వార్డు కార్పొరేటర్ సహాయంతో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. తన తండ్రి పీలా మహాలక్ష్మి నాయుడు పేరు నిలబెడతానని అన్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష మేరకు విశాఖ అభివృద్ధి కోసం అధికారులు ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటానని కొత్త మేయర్ పీలా శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే చంద్రమోహన్... వైజాగ్ ఎక్స్ప్రెస్ వ్యవస్థాపకులు నారాయణరావు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు గోగుల శ్రీనివాస్... ఎండి కమాలుద్దీన్ తదితరులు మేయర్ ను అభినందించారు. విశాఖ అభివృద్ధిలో జర్నలిస్టుల సహకారం కూడా తీసుకుంటానని అన్నారు.