ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టుల పక్షాన ఉంటుందని ఏపీయూ డబ్ల్యూయుజె జిల్లా ప్రధాన కార్యదర్శి రావులవలస రామచంద్ర రావు తెలిపారు. అనకాపల్లిలో జరిగిన ఉత్తరాంధ్ర జర్న లిస్టుల ప్రాంతీయ సదస్సు లో ఆయన మాట్లాడారు. పార్టీలకు అతీతంగా జర్నలిస్టుల సమస్యలపై నిర్మాణాత్మక పోరాటం చేస్తామన్నారు. ఇటీవల రాజకీయ పార్టీలు జర్నలిస్టుల పై దాడులకు పాల్పడుతున్నాయని ఇది ప్రజాస్వామ్య విరుద్ధంగా పేర్కొన్నారు. ఈ విషయంలో జర్నలిస్టులందరూ ఐక్యంగా బాధిత వర్గానికి అండగా ఉండాలని పిలుపు నిచ్చారు. ఎక్కడ ఏ పత్రిక పై దాడి జరిగినా అడ్డుకుని బాధ్యులపై చట్ట పరమైన చర్యలు తీసుకునే రీతిన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పనిచేస్తుందని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే గిరిజనేతర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశం లో జిల్లా అధ్యక్షులు కే రాము మాట్లాడుతూ చిన్న పత్రికల కు ప్రత్యేక శిక్షణ తరగతులు త్వరలో నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే విశాఖ జిల్లా ప్రతినిధులు కే.టి .రాము నాయుడు ,అనేష్ కుమార్, అభిరామ్ ,హరనాథ్ , అమర్నాథ్ గోగుల శ్రీనివాస్ ,గాజువాక అధ్యక్షులు పరశురాం ,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చంద్ర మోహన్ ,కలం వాసు, తదితరులు పాల్గొన్నారు