గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే - సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ

సామాజిక వేత్త, సంఘ సంస్కర్త, సమాజ సేవకుడు, మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప దేశభక్తి గల వ్యక్తి అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. పూలే 198వ జయంతిని శుక్రవారం సిపిఐ ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన కార్యక్రమంలో నారాయణ మాట్లాడుతూ పూలే దంపతులు సమాజలో నిమ్నజాతి వర్గాలు, అనగారిన వర్గాల అభ్యున్నతికీ విద్యభివృద్ధికి విశేషంగా పనిచేసారని నివాళులు అర్పించారు. పూలే, అంబేద్కర్ తదితర నాయకుల జయంతి వర్ధంతిలకు నాయకులఅందరూ పూలదండలతో నివాళులు అర్పిస్తూ అవెంటనే గ్రామాల్లోకి, విధుల్లోకి వెళ్లి దళితులు, ఆదివాసీలుపై వేరే దాడులు చేయిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశానికి స్వాతంత్ర వచ్చి 77 సంవత్సరాలు నిండినప్పటికీ అట్టడుగున ఉన్న ఆయా వర్గాల ఇంకా దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారని తెలిపారు. పాలకులు సిత్తశుద్ధి లేకపోవడమే ఇందుకు కారణమని వీటిని అదిగమించడానికి ప్రభుత్వాలు కృషి చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యదర్శి ఎం పైడిరాజు, కార్యవర్గ సభ్యులు ఎ విమల, సి ఎన్ క్షేత్రపాల్, నాయకులు ఎన్ నాగభూషణం, బి పుష్పలత, జి కాసులరెడ్డి, యు నాగరాజు, ఎ ఆదినారాయణ, ఎ రవి ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.