ప్రేమోన్మాది దాడి కేసులో యువతని రక్షించిన ఎస్.ఐ.భాస్కర్ కు సన్మానంపోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి.

మధురవాడ ఎ జె న్యూస్: మధురవాడ వైయస్సార్ కాలనీలో నాలుగవ అంతస్తు పై నుండి దూకేసుకు ప్రయత్నించిన మహిళ. కేసులో..సకాలంలో స్పందించి చాకచక్యంగా మహిళను కాపాడడం, 
మధురవాడలో పెను విషాదాన్ని నింపిన ప్రేమోన్మాది దాడి కేసులో యువతని రక్షించిన పీ.ఎం.పాలెం ఎస్.ఐ.భాస్కర్ కు గురువారం పోలీస్ కమిషనరేట్ ఆఫీసులో జరిగిన పోలీస్ ఉన్నత అధికారుల సమావేశంలో విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఎస్.ఐ.భాస్కర్ కు ప్రశంసా పత్రంతో పాటు ఘన సన్మానం నిర్వహించి,అభినందనలు తెలిపారు.ప్రజలకు కష్టాలలో భరోసా అందించడమే పోలీసు లక్ష్యమని, విధి నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించి ప్రాణాలు కాపాడడం గొప్ప విషయమని,ఎస్.ఐ.భాస్కర్ ప్రజల మన్ననలు పొందడం అభినందియమని అన్నారు.